తెలుగు వారి ఖ్యాతిని ఒక్కసారిగా పెంచేసిన ఆ సినిమా బాహుబలి. ఈ సినిమా ఇండియాలోనే కాదు ఇతర దేశాల అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి అండ్ టీమ్ ఐదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. ఎక్కడికెళ్లినా ఆ సినిమాకు సంబంధించిన వారిని ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. ఈ సినిమతో రాజమౌళి స్థాయి ఒక రెంజ్‌లో పెరిగిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమెరికా, జపాన్, టోక్యో, ఒసాకోలో ఈ మూవీ ప్రదర్శన జరుపుకుంది. ఇప్పుడు చైనాలోను విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని పాకిస్థాన్‌లో కూడా ప్రదర్శించనున్నారు.
అసలు విషయం ఏంటంటే.. ఇప్పటివరకు ప్రపంచంలో సినిమాలకు సంబంధించిన ఏ ఫెస్టివల్ జరిగినా కూడా బాహుబలి పేరు వినిపించేది. బాహుబలి కోసం చిత్ర యూనిట్ దాదాపు ముఖ్యమైన దేశాలన్నటిని కవర్ చేసింది. అయితే ఎవరు ఉహించని విధంగా దాయాధి దేశమైన పాకిస్థాన్ కూడా తెలుగు కళను మెచ్చింది. బాహుబలి హిందీలో రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి దర్శక దీరుడు రాజమౌళికి ఇన్విటేషన్ అందింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘బాహుబలి’ చిత్రం నాకు వివిధ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం కల్పించింది. ఆ విదేశాలన్నింటిలో నాకు పాకిస్థాన్ మరింత ఆనందాన్ని కలిగించింది. నన్ను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానించినందుకు గానూ పాకిస్థాన్, కరాచీకి ధన్యవాదాలు’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు తారక్ – ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Baahubali has given me opportunities to travel to a number of countries… The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite.
— rajamouli ss (@ssrajamouli) March 28, 2018