వెంకీ న్యూ లుక్‌..

239
- Advertisement -

హీరో వెంకటేశ్ దృశ్యం సినిమా తరువాత నుండి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకుపోతున్నాడు. వెంకీ ఒక్కో సినిమా కి ఒక్కో కొత్త లుక్ ట్రై చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి వెంకటేశ్ ట్విట్టర్ లో దర్శనమిస్తోంది.

Venkatesh 's Aata Nade Veta Nade New Look

వెంకీ కొత్త హెయిర్ స్టైల్ తో .. గెడ్డంతో .. స్పెట్స్ పెట్టుకుని చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకటేశ్ అభిమానులు మెచ్చేలా ఈ లుక్ వుంది. వెంకటేశ్ సరసన శ్రియ నటిస్తుండగా .. ఒక కీలకమైన పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నాడు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో వెంకటేశ్ ఉండటం విశేషం. డైరెక్టర్‌ తేజ గతంలో దగ్గుబాటి రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలావుండబోతుందో చూడాలి.

- Advertisement -