తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కన్నడిగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రజినీ దిష్టిబొమ్మలను సైతం దహనం చేశారు. ఇటీవలే కావేరీ జలాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రిమ్ తీర్పుపై రజనీకాంత్ స్పందిస్తూ.. ‘‘కావేరీ తీర్పు నన్ను తీవ్రంగా కలచివేసింది. తమిళ రైతుల జీవన విధానంపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
అయితే ఆయన తన ట్వీట్లో కన్నడిగులను ప్రస్తావించలేదు. రజనీ వ్యాఖ్యలపై కన్నడిగులు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. రామ్‌నగర్ జిల్లాలోని చన్నపట్నలో ఆందోళనకారులు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని, కన్నడిగులకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరో వైపు తమిళ నటుడు కమల హాసన్ కూడా కావేరీ తీర్పుపై స్పందిస్తూ..ఇది తనను ‘షాక్’కు గురిచేందని వ్యాఖ్యానించారు.
కాగా..సుప్రీం కోర్టు తీర్పుపై కన్నడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.