ఆఫర్లతో అటాక్‌..! జియో vs ఎయిర్‌టెల్..!

156
Airtel Launches New Rs 59 Prepaid Plan To Counter Jio's
- Advertisement -

రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌తో టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ 59 రూపాయలతో ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్‌ జియో ప్లాన్‌ 52 రూపాయలకు డైరెక్ట్‌గా అటాక్‌గా ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన ఈ 59 రూపాయల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వివరాలు… ఎంట్రీ లెవల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ అయిన ఇది… ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 500 ఎంబీ 3జీ లేదా 4జీ డేటాను వాడుకోవచ్చు. రోజు వారీ వాడకంపై ఎలాంటి పరిమితి లేదు. అంతేకాక ఈ 59 రూపాయల ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందించనుంది. అయితే ఈ ప్లాన్‌పై ఎలాంటి ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేయదు.కేవలం ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఇది అందుబాటులో ఉంటుంది. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌ ఎవరెవరికి అందుబాటులో ఉంటుందో తెలుసుకోవచ్చు.
  Airtel Launches New Rs 59 Prepaid Plan To Counter Jio's
జియో రూ.52 ప్లాన్‌ వివరాలు…
చౌవకైనా ప్లాన్ల కింద రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన రూ.52 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 1.05 జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా, ఫ్రీగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, 70 ఎస్‌ఎంఎస్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ కూడా 7 రోజులే. అయితే ఈ ప్యాక్‌ కింద రోజుకు 0.15జీబీ డేటా మాత్రమే వాడుకునే వీలుంటుంది.

- Advertisement -