- Advertisement -
తమ ఉద్యోగులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సర్ప్రైజ్ ఇచ్చింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి గాను 95 శాతం వేరియబుల్ పే అందించింది. గత తొమ్మిది త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధికమని… దీన్ని తాము ఊహించలేదని ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేశాడు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభంలో 38 శాతం వృద్ధిని సాధించింది.
అంతేకాదు, అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య కాలంలో 12,622 నియామకాలను చేపట్టింది. ఇటీవల టీసీఎస్ తమ ఉద్యోగులకు 100 శాతం టార్గెట్ వేరియబుల్ పేను ప్రకటించడం తెలిసిందే.
కాగా..ట్రంప్ దెబ్బతో ఐటీ రంగంలో మాంద్యం పరిస్థితులు నెలకొనడం, ఉద్యోగాల కోత నేపథ్యంలోనూ అనూహ్య స్థాయిలో వేరియబుల్ పేను ప్రకటించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 95 శాతం వేరియబుల్ పేని ప్రకటించడం అనూహ్యమని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
- Advertisement -