ప్రధాని జోక్యం చేసుకోవాలి…

236
Support and backlash after SC judges criticise CJI
- Advertisement -

సుప్రీంకోర్టు నలుగురు సీనియర్‌ న్యాయవాదులు నిర్వహించిన మీడియా సమావేశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. అత్యవసరంగా సమావేశం కావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ప్రధాని కార్యాలయం కోరింది. ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.

న్యాయ చరిత్రలో తొలిసారి న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పలువురు న్యాయవాదులు వీరికి మద్దతుగా నిలవగా మరికొందరు పెదవి విరిచారు.

వారిని విమర్శించలేము. న్యాయవృత్తి కోసం ఎంతో త్యాగం చేశారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి..-బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

సుప్రీం ఛీప్‌ దీపక్‌ మిశ్రా చాలా ఘోరంగా తన అధికారాలను దుర్వినియోగం చేశారు. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి ‘రోస్టర్ ఆఫ్‌ మాస్టర్’ గా తన పవర్‌ను వాడుకున్నారు.ఆయన వెంటనే రాజీనామా చేయాలి-ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది

న్యాయ‍వ్యవస్థకు ఇదొక బ్లాక్‌ డే.ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ ప్రతిష‍్టం భంగం కలిగేలా సుప్రీం న్యాయవాదులు వ్యవహరించారు. ఇకపై సామాన్య పౌరుడు కూడా ప్రతీ తీర్పును అనుమానించే అవకాశం ఉంది. సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికం

న్యాయమూర్తులు తమలో తాము సమస్యలను పరిష్కరించుకొని వుంటే బావుండేది- కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్

బయటకు వచ్చిన న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌కు వ్యతిరేకులు కాదు. కానీ కొలిజియంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉంటుంది-ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్‌

- Advertisement -