హెచ్1బీ వీసా..టెకీలకు గుడ్ న్యూస్‌

181
Relief to H-1B holders
- Advertisement -

హెచ్‌1-బి వీసా గడువు పొడిగింపును నియంత్రించాలన్న ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. లక్షలాది మంది హెచ్‌1బీ వీసా దారులను వెనక్కిపంపే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఆందోళనలో ఉన్న భారతీయులకు పెద్ద రిలీఫ్ లభించింది.

వీసా పొడిగింపు నిరాకరించి వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను   పరిగణలోకి తీసుకోబోమని  (యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాతన్‌ వితింగ్టన్‌ వెల్లడించారు.

ఒకవేళ మార్పులు ఏదైనా జరిగినా హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా కంపెనీలు అభ్యర్థించే అవకాశం ఉందని జొనాతన్‌ తెలిపారు.

Relief to H-1B holders
అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌1బీ వీసాల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.   ఆయా రంగాల్లో అర్హత ఉన్న అమెరికా పౌరుల లభ్యత లేని పక్షంలో అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి తాత్కాలిక వీసాలను మంజూరు చేసే కార్యక్రమమే హెచ్‌1బి. ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాదారులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది.

ఈ వీసా ప్రాథమిక గడువు ముగిసినా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు మరోసారి గడువు పెంచే అవకాశం ప్రస్తుతం ఉంది. అయితే ఈ గడువును పొడిగించకూడదని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో అంతాఅయోమయంలో పడ్డారు. ముఖ్యంగా ఈ నిర్ణయం భారతీయులపై ఎక్కువగా పడే అవకాశం ఉండేది.    5లక్షల మంది నుంచి 7,50,000 మంది వరకు వెనక్కు వెళ్లిపోవాల్సి  వచ్చేది కానీ అన్నివర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్ యంత్రాగం ఈ మేరకు ప్రకటన వెలువరించింది.

- Advertisement -