సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాలు. ఈ తమిళ తలైవా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కొన్ని సూచనలు చేశారు. రజనీకాంత్ డిసెంబర్ 26 నుండి చెన్నైలోని పలు ప్రాంతాలలో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి, అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఐదో రోజులో భాగంగా ఈ రోజు రజినీకాంత్ తన తాజా చిత్రాలు కాలా, 2.0 గురించి కూడా మాట్లాడారట. 1948లో వచ్చిన చంద్ర లేఖ చిత్రం ఇప్పటికి ఎలా గుర్తిండిపోయిందే 2.0 చిత్రం కూడా ఎప్పటికి ఫ్రెష్‌గా ఉంటుందని అన్నారట. జనవరిలో రావలసిన ఈ చిత్రం వాయిదా పడడానికి కారణం సీజీఐ వర్క్ అని రజినీ అన్నారు.
ఇక రెహమాన్ కూడా గ్రాఫిక్ వర్క్‌కి తగ్గట్టుగా రీ రికార్డింగ్ చేస్తున్నాడని అందువలన కొద్ది రోజులు వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. ఇక కాలా చిత్రం 2.0 మూవీ విడుదలైన రెండు నెలలకి విడుదల అవుతుందని, కాలా పాత్ర పోషించడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు రజినీ. ఇక కాలా తర్వాత ఏం జరగబోతుంది అనేది నేను చెప్పలేను. అంతా దేవుడి చేతులలోనే ఉందంటూ కాస్త సస్పెన్స్ లో పెట్టారు. డిసెంబర్ 31న రజనీ తన పొలిటికల్ ఎంట్రికి సంబంధించి క్లారిటీ ఇస్తానని ఇటీవల తెలపగా, రేపు రజనీకాంత్ ఏం మాట్లాడతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.