అభిమాని మృతి.. ఎన్టీఆర్ స్పందన ఇదే

41
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. అభిమాని అనుమానాస్పద మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. ‘శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మృతి చెందారో తెలియకపోవడం నా మనస్సును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలి’ అని ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మా తారక్ అన్న వీరాభిమాని శ్యామ్ మృతిపై అనుమానాలున్నాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. #WeWantJusticeForShyamNTR హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తూ.గో. జిల్లాకు చెందిన శ్యామ్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అయితే గంజాయి అలవాటు లేని శ్యామ్ జేబులో, నోట్లో గంజాయి ప్యాకెట్లు కుక్కారని, చేతిపై కత్తి గాటు ఉందని పోస్టులు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: బాలయ్యకి నయనతారే కావాలట

హీరో నిఖిల్ దీనిపై స్పందిస్తూ.. ‘సినిమా ఉనికికి కారణమైన సినీ అభిమాని.. మనలో ఒకడైన శ్యామ్ మృతిపై పోలీసులు విచారణ జరపాలని అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఏది ఏమైనా శ్యామ్ అనుమానాస్పద మృతి పై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలి.

Also Read: ఈ స్టార్ల పూర్తి పేర్లు మీకు తెలుసా ?

- Advertisement -