తగ్గేదే లేదంటున్న నాని…

215
Nani’s 'Krishnarjuna Yuddham' release date locked
- Advertisement -

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ .. తొలి రోజున మిశ్రమ స్పందనను రాబట్టినప్పటికీ, భారీ వసూళ్లను సాధిస్తూ హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ ఏడాది కూడా నాని డబుల్ హ్యాట్రిక్‌తో సక్సెస్‌ ఫుల్‌గా న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.

ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని డబుల్ రోల్ చేస్తుండటం గమనార్హం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో విజయాలు అందుకున్న గాంధీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఫుల్ పాజిటివ్ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారనే చెప్పాలి.

Nani’s 'Krishnarjuna Yuddham' release date locked
ఎందుకంటే  2018 ఏప్రిల్‌ రజనీ ‘2.0’ ,మహేశ్ ‘భరత్ అనే నేను’,అల్లు అర్జున్ ‘ నా పేరు సూర్య’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ నెలలో ‘2.0’ రిలీజ్ డేట్ ఖరారైన దానిని బట్టి తమ సినిమాల విడుదల తేదీలను ఫిక్స్ చేయాలని మహేశ్ .. బన్నీ సినిమాల దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటూ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. కొంతమంది వారించినా చిత్రయూనిట్,నాని మాత్రం అలాంటివేమి పట్టించుకోలేదట.

- Advertisement -