జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మూవీ ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాపైనే ఇప్పుడు సినీ లవర్స్ దృష్టి పెట్టారు. ఈ నెల 16న వదిలిన ఈ సినిమా టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక 19వ తేదీన జరిగిన ఆడియో వేడుక కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలాలనుకున్నారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ ట్రైలర్ ను క్రిస్మస్ మరుసటి రోజున, అంటే 26వ తేదీన విడుదల చేయనున్నారట.
పవన్ కల్యాణ్ చెప్పిన ఓ పవర్ఫుల్ డైలాగ్ పై ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా .. సినిమాపై మరింత భారీగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ఉండనుందట. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది.