మహేష్‌ డైరెక్షన్‌లో ‘ఎగసే తారాజువ్వలు’..

299
Kathi Mahesh's "Egise Tarajuvvalu" Pre Release Event
- Advertisement -

హెచ్ వై ప్రొడక్షన్స్ పై శ్రీమతి వాని ఇరగం ప్రెసెంట్స్ ‘ఎగసే తారాజువ్వలు’ చిత్రాన్ని నిర్మాత నాగ మల్లా రెడ్డి నిర్మించగా మహేష్ కత్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యం లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్. తారాజువ్వలు చిత్ర వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ బిగ్ సిడిని, మరియు చాలాకి న్యూస్ వెబ్ సైట్‌ను లాంచ్ చేయగా ఈ చిత్ర ఫస్ట్ సాంగ్‌ను అతిథులు శేఖర్ కమ్ముల, తమ్మారెడ్డి భరద్వాజ్, చిన్ని కృష్ణలు కలసి మధురా ఆడియో ద్వారా విడుదల గావించారు, ఈ చిత్ర ట్రైలర్ గీతా కృష్ణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, శ్రీనివాస్ రాజ్, మధురా శ్రీదర్లులు విడుదల చేశారు.

Kathi Mahesh's "Egise Tarajuvvalu" Pre Release Event

అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో స్కూళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సెన్సీటివ్ టాపిక్ ను అటెంప్ట్ చేసిన దర్శక నిర్మాతలకు నా అభినందనలు అని అన్నారు. కమర్షియల్ సినిమాలు చేసి డబ్బు సంపాందించుకోవాలని చూసే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కాన్సెప్ట్ ను తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా సినిమా చేసిన కత్తి మహేష్‌ను, నిర్మాత మల్లారెడ్డి ను అభినందించకుండా ఉండలేం అని అన్నారు.

Kathi Mahesh's "Egise Tarajuvvalu" Pre Release Event

ముఖ్య అతిథి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ఈ ప్లేసులో ఉన్నాను అంటే బాగా చదుకోవడమే కారణం. మార్కులు ఇంపార్టెంట్ కాదు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏ సమస్యలు వచ్చినా ఎవరికివారే ధైర్యంగా పరిష్కరించుకునేలా పిల్లలు ఎదగాలని కోరుతున్నా అని చెబుతూ ఈ చిత్రంలో నటించిన చైల్డ్ అర్టిస్ట్స్‌కు మేసెజ్‌తో కూడిన కార్డ్స్‌ను, పెన్స్ ను అందించారు.

Kathi Mahesh's "Egise Tarajuvvalu" Pre Release Event

దర్శకుడు మహేష్ కత్తి మాట్లాడుతూ.. చదువంటే బట్టి పట్టడం కాదు జీవితాన్ని వడేసి పట్టడం అనే అంశాన్ని ఎంటర్టైనింగ్ గా, సెన్సిటివ్ గా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. సినిమా చూసిన ప్రతిఒక్కరినీ నిరుత్సాహ పరచదు అని మాత్రం నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. చాలా కష్టపడి సినిమా చేశాము. ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు నిర్మాత నాగ మల్లా రెడ్డి.

Kathi Mahesh's "Egise Tarajuvvalu" Pre Release Event

ఈ కార్యక్రమానానికి అవసరాల శ్రీనివాస్, క్రాంతి మాధవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, లక్ష్మీ భూపాల్, సతీష్, అజయ్ ఘోష్, మరియు ఈ చిత్ర యూనిట్, పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలు తెలియచేసారు. యశ్వంత్, హాసిని, సౌమ్య వేణుగోపాల్, అజయ్ గోష్, లోహిత్, స్వప్న , అప్పాజీ అంబారిష్ఠ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: మహేష్ కత్తి, నిర్మాత: నాగ మల్లారెడ్డి, కో డైరెక్టర్: కార్తిక్ మెడికొండ, కెమెరా: వినోద్, రాజేంద్ర, మ్యూజిక్: గంటశాల విశ్వనాధ్, కాస్ట్యూమ్స్: నిహారిక, లిరిక్స్: భాస్కరభట్ల, శ్రేష్ఠ, ఎడిటర్: రవితేజ, రఘు.

- Advertisement -