సినిమాల్లోకి సచిన్ కూతురు సారా?

222
- Advertisement -

లెజెండరీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగాడు.. ఇప్పుడు తన కూతురు సారా టెండుల్కర్, కొడుకు అర్జున్ టెండుల్కర్‌ కెరీర్‌లను తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. అర్జున్ టెండుల్కర్ ఇప్పటికే క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. ముంబై అండర్ 19 టీంలో కూడా చోటు సంపాదించాడు. ఇక సెటిల్ కావాల్సింది సారానే.. తాజా సమాచారం ప్రకారం సచిన్ కూతురు సినిమాల్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సచిన్ కుమార్తెను బాలీవుడ్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిచయం చేయనున్నాడు. ఈమేరకు కథలు కూడా విన్నాడు. సారా టెండూల్కర్ ను రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ ల సరసన నటింపజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Sachin Tendulkar's Daughter Sara to Enter Bollywood

మరోవైపు సారా కూడా వార్తల్లో నిలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి బాయ్ ఫ్రెండ్‌తో బిటౌన్ హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సారా కూడా జాహ్నవి బాటలో పయనిస్తోందని, సినిమాలవైపే ఇంట్రస్ట్‌ చూపుతున్న నేపథ్యంలో సచిన్ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చానని ,ఆమెకు అవసరమైన సూచనలు మాత్రమే చేస్తానని అప్పట్లో స్పష్టం చేశాడు.

- Advertisement -