బాహుబలి సినిమాతో టాలీవుడ్ జనాలకే కాదు బాలీవుడ్ జనాలకు సైతం మన డార్లింగ్ ప్రభాస్ తెగనచ్చేశాడు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్న ప్రభాస్…లుక్ మార్చి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
సుజీత్ దర్శకత్వం ఈసినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందన్నది తాజా సమాచారం. ఒక పాత్ర ప్రభాస్ జోడీగా కనిపిస్తే .. మరో పాత్ర నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని అంటున్నారు.
అయితే ఇది ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోన్న టాక్ మాత్రమే. ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ, కన్నడ భాషా ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.