విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. మొదట ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు వుండేదట. అయితే ఆడియన్స్ బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉందని భావించి, 15 నిమిషాల నిడివిని తగ్గించి వదిలారు.
అయితే అర్జున్ రెడ్డి మూడు గంటల సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఈ కాలంలో మూడు గంటలేంటి? ఖచ్చితంగా బెడిసికొట్టే వ్యవహారమిది అని మాట్లాడుకున్నారు. దర్శక నిర్మాతలకి కూడా సీరియస్‌గా సలహాలు ఇచ్చారు. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం సీతయ్యలాగా ఎవరి మాటా వినకుండా తాను నమ్మిందే చేశాడు. ఫీల్ మిస్సవ్వకూడదని ఆయన తీసిన అర్జున్ రెడ్డిని మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది.
ఈ సినిమా 3 గంటల పాటు ఉన్నప్పటికీ యూత్ ఎంత మాత్రం బోర్ ఫీలవ్వకుండా చూస్తున్నారట. దాంతో తాము ముందుగా అనుకున్న 15 నిమిషాల సీన్స్ ను కూడా కలిపితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. ఆ 15 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేయడం వలన మరింత ఫీల్ వస్తుందని చెబుతున్నాడట. అయితే ఈ 15 నిమిషాల ఫుటేజ్ ను వెంటనే యాడ్ చేద్దామా? లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేద్దామా? అనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.