అర్జున్ రెడ్డికి ఐదేళ్లు..

29
vijay
- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017లో రిలీజ్‌ అయిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్‌లో సైతం సినిమా సత్తాచాటి మంచి వసూళ్లు రాబట్టింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ డిలీట్ సీన్ ని షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేసిన యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఈ వీడియో సినిమాలో ప్రీతికి కిస్ ఇస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి చూసే సీన్ తర్వాత ఉండేది. ఆ సీన్ అయ్యాక విజయ్, ఫ్రెండ్ క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇందులో విజయ్.. నేను ప్రీతికి ప్రేమతో కిస్ ఇచ్చా కలిసి చాలా రోజులైందని. దాన్ని వాళ్ళ నాన్న తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు.

ఈ సీన్ సినిమాలో ఉంటే చాలా బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -