స్పైడర్ షూటింగ్ కంప్లీట్…

251
spyder-mahesh
- Advertisement -

మహేష్‌ బాబు, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న చిత్రం స్పైడర్‌. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రొమానియాలో షూటింగ్‌ జరుపుకుంది. అక్కడే ఈ సినిమాకి సంబంధించిన చివరి పాటను తెరకెక్కించింది చిత్ర బృందం. రొమేనియాలో ఓ సాంగ్ పిక్చరైజేషన్ తో ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. యూనిట్ ఈరోజు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమౌతోంది.

spyder-mahesh

నిజానికి నెల రోజుల కిందటే స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తికావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కోసం షెడ్యూల్స్ పొడిగించాల్సి వచ్చింది. వీటి కోసం ప్రత్యేకంగా షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే రిలీజ్ డేట్ ను కూడా ఒకసారి వాయిదా వేసి దసరా బరిలో సినిమాను నిలిపారు. సెప్టెంబర్ 27న స్పైడర్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రేపు హైదరాబాద్ కి చేరుకోనున్న మహేష్ .. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

spyder-mahesh

కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం సారధి స్టూడియోలో అసెంబ్లీ సెట్ వేశారు. జనతా గ్యారేజ్ సెట్ ని కూడా కొరటాల ఈ స్టూడియోలోనే వేశారు. ఆ సినిమా హిట్ కావడంతో అదే సెంటిమెంట్ తో అసెంబ్లీ సెట్ కూడా వేయించినట్లు సమాచారం. ఇక్కడ కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. ఇక స్పైడర్ విషయానికి వస్తే సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో సెప్టెంబర్ 10 న నిర్వహించనున్నారు.

- Advertisement -