అనుష్క మూవీ షూటింగ్‌లో విషాదం

218
Technician dies on the set of Anushka Sharma’s Pari
- Advertisement -

బాలీవుడ్‌లో కథానాయికగా అనుష్క శర్మకి ఫుల్‌ క్రేజ్ ఉంది. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ఈ అమ్మడు ఒక వైపున అగ్ర హీరోలతో జోడీ కడుతూనే , మరో వైపున సొంత బ్యానర్లోనూ నటిస్తోంది. ‘క్లీన్ స్లేట్’ బ్యానర్ ను స్థాపించిన ఆమె ఆ బ్యానర్ పై ప్రస్తుతం ‘పరి’ అనే హారర్ థ్రిల్లర్ ను నిర్మిస్తోంది.

ఈ చిత్రానికి ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బెంగాలీ నటుడు పరంబ్రతా చటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం కోల్‌కతాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అనుష్కశర్మ నటిస్తున్న ఈ షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది.

Technician dies on the set of Anushka Sharma’s Pari

కోల్ కతా లోని 24 పరగణాల జిల్లాలోని కరోల్ బెరియాలో ఔట్ డోర్ షూటింగ్ లో జరిగిన ఈ విషాద సంఘటనలో షా ఆలమ్ (28) అనే టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ ముగిసిన తర్వాత లొకేషన్ లోని ఓ వెదురు పొదలో విద్యుత్ వైర్ ను ముట్టుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా ఓ వెదురు పొద చుట్టూ నటులు, వస్తువులు కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేయగా, విద్యుత్ ప్రసారం అవుతున్న ఓ వైర్ ను షా ఆలమ్ కు తగలడంతో పడిపోయాడు. వెంటనే, ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

- Advertisement -