జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త అందించింది. గురువారం సాయంత్రం 5 గంటల నుండి జియో 4జీ ఫోన్ కోసం నుంచి ఫ్రీగా రిజిస్టేషన్ చేసుకోవచ్చని రియలన్స్ జియో ప్రకటించింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ కావాలనుకునేవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో బుకింగ్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో ప్రకటించింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నవారు మైజియో యాప్స్, జియో. కామ్ సైట్లో చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఇండియాలో మొత్తం 50 లక్షల సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఫోన్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సెప్టెంబర్ 1 నుంచి 4 తేదీ మధ్యలో సప్లై చేస్తామని తెలిపారు. జియో 4జీ ఫీచర్ ఫోన్ డెలివరీ చేసిన వెంటనే సెక్యూరిటీ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత 1500 రూపాయలను తిరిగి చెల్లిస్తామన్నారు. ఆఫ్‌లైన్ స్టోర్లలో ఫోన్ రిజిస్ట్రేషన్ చేసుకోనే సమయంలో ఆధార్ జిరాక్ కాపీ ఇవ్వాలన్నారు.
కాగా, పేరుకు ఇది ఫీచర్ ఫోనే అయినా, దీంట్లో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్ని రకాల యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. సినిమాలు చూసుకోవచ్చు. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.