మహేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది..!

622
Keerthi Suresh in Mahesh babu's 25th film
Keerthi Suresh in Mahesh babu's 25th film
- Advertisement -

ఇప్పటికే స్పైడర్ మూవీ కంప్లీట్ చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నాన్‌స్టాప్‌గా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. కొరటాల శివతో ఇప్పటికే మూవీ మొదలు పెట్టిన మహేష్.. ఆ తర్వాత పైడిపల్లితో సినిమా చేస్తాడు. మహేష్‌కు ఇది 25వ సినిమా. ఇదిలాఉండగా మహేష్ తన 26 వ సినిమా కూడా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అది కూడా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

Mahesh babu Spyder Song Shoot in Romania

అయితే మహేష్‌ -వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ ప్రస్తుతం భరత్ అను నేను సినిమాలో బాగా బిజీగా ఉన్నాడు. కానీ ఆయన మనసంతా స్పైడర్ సినిమా మీదే ఉంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్.. స్పైడర్‌ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా. ఇక భరత్ అను నేను సినిమాలో బాలీవుడ్ నటి కైరా అద్వాని నటిస్తోంది. ఇది కూడా కైరాకు మహేష్‌కు మొదటి సినిమానే.

kiara advani for mahesh babu

తన ప్రతి సినిమాలో కంటెంట్ తో పాటు కత్తిలాంటి హీరోయిన్లు కూడా సెలక్ట్ చేసుకోవడం మహేష్ స్పెషాలిటీ. ఆ టైమ్లో ఏ హీరోయిన్ ఫామ్‌లో ఉంటే ఆ హీరోయిన్‌ను తీసుకుంటాడు మహేష్‌. ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాను కూడా సూపర్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. మహేష్ ఆమె కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి.. హీరో రామ్‌కి అదిరిపోయే హిట్ ఇచ్చింది. అంతేకాదు ఆమె తమిళంలో చేస్తున్న సినిమాలన్నీ దాదాపు హిట్లే. ఇక మహేష్ 26 సినిమా కూడా పక్క హిట్ ఖాయమని సోషల్ మీడియా తేల్చేసింది.

keerthy suresh crazy movie offer in tollywood

మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కీర్తి సురేష్ కూడా అంతే కదా.. కాకపోతే ఆ అవకాశం రావాలి కదా.. ప్రస్తుతం కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తోంది. మహా నటిలో సావిత్రిగా చేస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు అయిన తర్వాతనే ఇంకో సినిమా గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మహేష్ సినిమాలో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చేసింది కీర్తి. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలో నటించడం లేదని తేల్చేసింది. తనను ఇంతవరకు మహేష్‌-వంశీ టీం సంప్రదించలేదని స్పష్టం చేసింది.

- Advertisement -