ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, మిగతా నటీనటులు ఎవరు అనే వివరాలు ప్రకటించారు.
ఓ కోట శిఖరంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా.. దాని చుట్టూ బ్రిటిషు సైనికుల శవాలు.. కోట బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ దృశ్యాలతో మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘సై.. సైరా నరసింహారెడ్డి’ అనే నినాదాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించాయి. కానీ చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఆయన ముఖం కనపడలేదు.
ఇందులో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇతర పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే!
https://youtu.be/mdY7MK9jIS8