గోల్కొండ కోటలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్ ప్రసంగం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త తెలియజేశారు సీఎం. ఇప్పటివరకు చేపట్టిన 27660తో పాటు 84877 నియమకాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ నియమాకాల ప్రక్రియను రాబోయే కొద్ది నెలల్లో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణలో ఆశించినదానికన్న మిన్నగా 112536 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నదని చెప్పారు. వచ్చే సంవత్సరం ఏర్పడే ఖాళీలను కూడా ఈ సంవత్సరమే నియామకం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.