టామ్ క్రూజ్ ఇంపాజిబుల్‌ స్టంట్.. వీడియో

323
Tom Cruise injured during Mission Impossible 6 shooting
Tom Cruise injured during Mission Impossible 6 shooting
- Advertisement -

ముప్పై ఐదేళ్లుగా నటుడిగా కొనసాగుతూ అగ్ర తారగా ఎదిగాడు టామ్‌ క్రూజ్‌. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరిగా నిలిచాడు. టామ్ క్రూజ్ నటించిన సినిమా రోగ్ నేషన్ సినిమా విడుదలై సంచలనం రేపింది. దీనికి సీక్వెల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్ 6’ రాబోతుంది. ఇప్పటికే 5 సీక్వెల్‌ రాగా.. వాటిలో టామ్ క్రూజ్ పోరాట సన్నివేశాలు అసాధారణం. తాజాగా మిషన్ ఇంపాజిబుల్ 6లో టామ్ క్రూజ్  అలాంటి స్టంట్లే చేస్తుండగా జంపింగ్ స్టంట్ బెడిసి కొట్టింది.

బ్రిటన్‌లో షూటింగ్ జరుగుతుండగా 55 ఏళ్ల టామ్ క్రూజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఛేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నవేళ అదుపు తప్పిన హీరో, ఓ భవనం గోడను బలంగా ఢీకొన్నాడు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఓ బిల్డింగ్ నుంచి కిందికి దూకాలి. అదే స్టంట్ ను చేస్తుండ‌గా ఒక్క‌సారిగా ప‌క్క‌నే ఉన్న గోడ‌కు ఢీకొన్నాడు టామ్ క్రూజ్. దీంతో టామ్ కాలుకు గాయాల‌య్యాయి. త‌ర్వాత లేచిన టామ్ కుంటుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు టామ్ క్రూజ్ స్టంట్ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది.

- Advertisement -