జాతీయ జెండా ఎగురవేసిన ఎంపీ కేశవరావు..

27
kk

సెప్టెంబర్‌ 17 సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కే కేశవరావు . సెప్టెంబర్‌ 17న తెలంగాణ విలీన దినమేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని స్పష్టం చేశారు కేకే. ఈరోజుతోనే మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. సెప్టెంబర్‌ 17పై కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.