నా కెరియర్‌లో ఇదే బెస్ట్ మూవీ..

183
Gautham Nanda Director Sampath Nandi
- Advertisement -

మొదటి సినిమాతోనే ఆకట్టుకొన్న దర్శకుడు సంపత్‌ నంది. ‘ఏమైంది ఈ వేళ’తో హిట్‌ అందుకున్న సంపత్ తర్వాత బెంగల్‌ టైగర్‌తో రచ్చ చేసి మాస్ దర్శకుడిగా తనదైన ముద్రవేశాడు. తాజాగా గోపిచంద్‌ హీరోగా గౌతమ్‌ నంద అనే సినిమాను తెరకెక్కించాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సంపత్‌పై గోపీచంద్‌ పెట్టుకొన్న అంచనాలు నిజమయ్యేలా సంపత్ నంది కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.

Sampath Nandi

సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమ్ నంద’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా టీమ్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మాట్లాడాడు. సినిమాపై క్రేజ్ ఉండటం వలన తాము పెద్దగా పబ్లిసిటీ చేయలేదనీ, రిలీజ్ అయిన తరువాత చూస్తే రివ్యూలు దారుణంగా అనిపించాయని చెప్పాడు. అయితే ప్రేక్షకులు మాత్రం తమకి మంచి సపోర్ట్ ఇచ్చారని అన్నాడు. తన స్నేహితులు సన్నిహితులు ఫోన్ చేసి అభినందించారని చెప్పాడు. తానెంతగానో ఇష్టపడే వాళ్లు నా కెరియర్‌లో ఇదే బెస్ట్ మూవీ అంటూ ప్రశంసించారని అన్నాడు. కథా కథనాలను తాను నడిపించిన తీరు అద్భుతమంటూ మరికొందరు అభినందించారని చెప్పాడు. అలా ఈ సినిమాతో తాను విమర్శలతో పాటు ప్రశంసలను కూడా అందుకున్నానని అన్నాడు.

- Advertisement -