సమంత కల నెరవేరిందట..!

214
Samantha Start Owne Business
- Advertisement -

టాలీవుడ్‌ అగ్ర కథానాయికలు సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా ముందున్నారు. సినిమాలు చేస్తూనే సొంత వ్యాపారాలు ఆరంభించేస్తున్నారు. వరుస షూటింగుల్లో పాల్గొంటూనే వ్యాపార వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలా ఇప్పటికే తమన్నా జ్యుయలరీ బిజినెస్‌ను రకుల్ జిమ్ బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. తాజాగా ఈ జాబితాలో సమంతా కూడా చేరిపోయింది.

Samantha Latest Stylish Photos 2014-Webparx

ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత తెలంగాణ ప్రభుత్తం చేపట్టిన వొవెన్ 2017 కార్యక్రమం కోసం పలు ప్రమోషన్స్ చేస్తుంది. అలాంటి సమంతా ఎస్.వి.ఎస్. పార్ట్నర్స్ – ఎల్. ఎల్.సి పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఈ సంస్థను స్థాపించడం తన కల అనీ దీని ద్వారా తన కలను సాకారం చేసుకుంటానని చెప్పింది. సమంతా స్థాపించిన కంపెనీ ఎలాంటి ఉత్పత్తులను ఎలాంటి సేవలను అందించనుందనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఇప్పుడు తెలుగులో సమంత రంగస్థలం 1985, రాజు గారి గది 2, మహా నటి చిత్రాలలో నటిస్తు బిజీగా వుంది.

 

- Advertisement -