SIRపై అసత్యప్రచారం ఇంకెంతకాలం:బీజేపీ

1
- Advertisement -

ఎన్నికల సంఘం (ECI)కి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ ఇండియా కూటమి నేతలు అదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. ప్రజలకు సంబంధించిన అసలైన సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇప్పటికే ప్రాధాన్యత కోల్పోయిన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వివరణలు ఇచ్చిన తర్వాత కూడా ఇండియా కూటమి నేతలు అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు. చనిపోయిన అంశానికి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా ప్రజల్లో చర్చ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగబద్ధమైన సంస్థలైన సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలపై మాట్లాడకుండా రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం తగదని హితవు పలికారు.

గతంలో ఎనిమిది సార్లు నిర్వహించిన విధంగానే ప్రస్తుతం కూడా సహజమైన ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్ (SIR) నిర్వహించారని రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల సమయాన్ని వృథా చేయవద్దని ఇండియా కూటమి నేతలకు సూచించారు.

Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

- Advertisement -