కాశీ నుంచి ఢిల్లీకి వందేభారత్

4
- Advertisement -

దేశీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాశీ (వారణాసి) నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానిస్తూ రెండో వందేభారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీ, కాశీ మధ్య రైలు ప్రయాణం చేసే వారికి ఈ రోజు చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. కాశీ-ఢిల్లీ వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభంతో ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా ప్రయాణికుల అనుభవం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పాటు అత్యాధునిక భద్రతా వ్యవస్థను ఈ రైలులో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇది దేశంలో రెండో వందేభారత్ స్లీపర్ రైలు అని పేర్కొన్నారు.

Also Read:జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’

ఈ రైలు కాశీ నుంచి ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా ఢిల్లీకి చేరుకోనుంది. దీంతో లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు, విద్యార్థులు, యువత, వ్యాపారవేత్తలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. బాబా విశ్వనాథుడి దర్శనానికి వెళ్లేవారికి సంగమ క్షేత్రాన్ని సందర్శించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ రైలు ఆధ్యాత్మికతను అవకాశాలతో, సంప్రదాయాన్ని ఆధునికతతో అనుసంధానిస్తుందని తెలిపారు. కొత్త రైలు సేవ అందుబాటులోకి రావడంపై ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -