ప్రజాస్వామ్య రక్షణకు కలిసి నడుద్దాం

6
- Advertisement -

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామలీలా మార్చ్‌’లో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు చోరీని అడ్డుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఈ మార్చ్‌ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దేశ ప్రజల ఉద్యమమని అభివర్ణించారు.

సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై అసంతృప్తి ఉన్నవారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పోలీసులు, లాఠీచార్జీలకు భయపడకుండా మార్చ్‌లో పాల్గొనాలని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకు అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు, తమ భావప్రకటన స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నాయని భావించే విద్యార్థి సంఘాలు రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Also Read:తులాభారం షూట్‌లో రవితేజ

ఈ మార్చ్‌లో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఓటరు జాబితాల నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

- Advertisement -