బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా హర్దీప్

7
- Advertisement -

మధ్యప్రదేశ్‌లో జరగనున్న 2026 రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 28న విడుదల చేసిన ప్రకటనలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపింది. మాజీ కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి నవంబర్ 12న ఉప ఎన్నిక జరగనుంది.

తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టేందుకు ఎల్. మురుగన్ ఈ నెల ప్రారంభంలో రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి హర్దీప్ సింగ్ పూరీని బీజేపీ ఎంపిక చేసింది.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నవంబర్ 12న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అక్టోబర్ 26న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 2 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 3న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 5న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది.

Also Read:జియో ఐపీవోపై అంబానీ

- Advertisement -