తెలంగాణకు అమిత్ షా..డేట్ ఫిక్స్

1
- Advertisement -

నవంబర్ 2న తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. లోక్‌తంత్ర్ బచావో ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు . షా టూర్ ఖరారు అయిన నేపథ్యంలో బీజేపీ నేతలుల ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

అలాగే తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నారు అమిత్ షా. అలాగగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ

ప్రధాని నరేంద్ర మోదీ డి…సెంబర్‌లో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -