పడిక్కల్ డబుల్ సెంచరీ మిస్‌!

1
- Advertisement -

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా డబుల్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో 199 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే అంపైర్ ఇచ్చిన ఔట్ నిర్ణయంపై పడిక్కల్ అసహనం వ్యక్తం చేశాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య చాలా దూరం ఉందని పడిక్కల్ అలాగే ఉండిపోయి చివరకు క్రీజు వదిలాల్సి వచ్చింది.

లింకన్‌లోని బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో పడిక్కల్ భారత-ఏ జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. పడిక్కల్ 56 పరుగులతో, సాయి సుదర్శన్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత పడిక్కల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ స్కోరు సాధించాడు.

జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మిచెల్ హేకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికి అతడు 199 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్‌తో కలిసి మూడో వికెట్‌కు 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్శన్ 91 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం యశ్ రాథోడ్‌తో కలిసి పడిక్కల్ మరో 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. రాథోడ్ 66 పరుగులు చేశాడు.

Also Read:FMCG:సామాన్యులకు మరో షాక్‌..

తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ కేవలం 113 పరుగులకే ఆలౌట్ కావడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే పడిక్కల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును పటిష్ఠ స్థితికి చేర్చాడు. అంతకుముందు న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది.

- Advertisement -