ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు.. ఓ అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు, భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతినకపోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 91వ కిలోమీటరు మైలురాయి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా హలియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పటికీ రాహుల్ గాంధీ సురక్షితంగా ఉండటంతో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించి కోర్టుకు వెళ్లినట్లు సమాచారం.
Also Read:FMCG:సామాన్యులకు మరో షాక్..
2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన పరువునష్టం కేసులో తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది.

