నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన సంగీత కానుక ‘రంగులు రంగులే’ పాట విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి ప్రయాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. తెలుగులో రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ తమ గాత్రాన్ని అందించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు.
నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ ప్రపంచాన్ని మరో సంగీత అనుభూతితో పరిచయం చేస్తూ వచ్చిన ‘రంగులు రంగులే’ పాటలో శ్రీరాముడు, సీతమ్మ ప్రయాణంలోని అందమైన ఘట్టాలను చూపించారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వైభవోపేతమైన రాజప్రాసాదాలు, శ్రీరాముడు, సీతమ్మ వివాహ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి అనుబంధంలోని అందం, భావోద్వేగాలను ఈ విజువల్స్ చక్కగా ఆవిష్కరించాయి.
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్న ఈ పాట ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ రామాయణ, టీ-సిరీస్ యూట్యూబ్ ఛానళ్లలో అందుబాటులో ఉంది. అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోనూ విడుదలైంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేశారు.
రాజప్రాసాదాల వైభవం, పవిత్రమైన వివాహ వేడుకలు, అయోధ్యను దాటి సాగిన ప్రయాణం.. ఇలా శ్రీరాముడు, సీతమ్మ జీవితంలోని వివిధ ఘట్టాలను ఈ పాటలో చూపించారు. విల్లు, బాణం, ఖడ్గంతో కనిపించే శ్రీరాముడి దృశ్యాలు విజువల్స్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. విశాలమైన ప్రకృతి దృశ్యాలు వారి కథ సాగిన ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి.
Also Read;FMCG:సామాన్యులకు మరో షాక్..
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశంలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది.

