కాంగ్రెస్‌,బీజేపీని దాటేసిన CJP

3
- Advertisement -

సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్‌ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)… కాంగ్రెస్‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు పది రాజకీయ పార్టీలు, నాయకులకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించారు. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీకి మొత్తం 2.17 కోట్ల ఎంగేజ్‌మెంట్లు లభించాయి. పరిశీలించిన మొత్తం ఎంగేజ్‌మెంట్లలో ఇది 25 శాతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2.05 కోట్ల ఎంగేజ్‌మెంట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఎంగేజ్‌మెంట్లలో 23 శాతం. రాహుల్ గాంధీ 1.46 కోట్ల ఎంగేజ్‌మెంట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం ఎంగేజ్‌మెంట్లలో ఆయన వాటా 17 శాతంగా నమోదైంది.

డేటా బీయింగ్స్‌ గురువారం ఎక్స్‌ (X) వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం పది ఖాతాలకు కలిపి 8.78 కోట్ల ఎంగేజ్‌మెంట్లు నమోదైనట్లు తెలిపింది.

Also Read:ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ నేలమట్టం

ఈ జాబితాలో భారత యువజన కాంగ్రెస్‌ (IYC) 74 లక్షల ఎంగేజ్‌మెంట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 50 లక్షల ఎంగేజ్‌మెంట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI)కు 18 లక్షల ఎంగేజ్‌మెంట్లు లభించాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఖాతాకు 14 లక్షల ఎంగేజ్‌మెంట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ 12 లక్షల ఎంగేజ్‌మెంట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ…బీజేపీ, కాంగ్రెస్‌, రాహుల్ గాంధీని అధిగమించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -