నేచురల్ స్టార్ నాని నటించిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 22, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు ఓటీటీ వెర్షన్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ వెర్షన్తో పోలిస్తే నెట్ఫ్లిక్స్లో సినిమా నిడివి సుమారు 23 నిమిషాలు తగ్గింది. అంతేకాదు, మూడు సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. వీటిలో నటి సోనాలి కులకర్ణి డ్యాన్స్ సీక్వెన్స్ కూడా ఉందని తెలుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో సుమారు 2 గంటల 53 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం దాదాపు 2 గంటల 30 నిమిషాల నిడివితో అందుబాటులోకి వచ్చింది. సినిమా నిడివిలో ఇంత పెద్ద మార్పు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సన్నివేశాలను ఎందుకు తొలగించారనే విషయంపై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
‘ది ప్యారడైజ్’లోని ధూమావతి ఎపిసోడ్లో నటి సోనాలి కులకర్ణి పాల్గొన్న డ్యాన్స్ సీక్వెన్స్ నెట్ఫ్లిక్స్ వెర్షన్లో కనిపించడం లేదని సమాచారం. సెప్టెంబర్ 24న విడుదలైన ‘ది ప్యారడైజ్’కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథనం, స్క్రీన్ప్లే, సినిమా నడిచిన తీరు వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి.
Also Read;ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ నేలమట్టం

