ఐదో రీల్‌లో…. సినీ’మత్తు’ రివీలైంది

184
Navdeep reveals Drugs racket secreat
- Advertisement -

టాలీవుడ్‌కి కుదిపేసిన  డ్రగ్స్ వ్యవహారంలో అధికారులు కీలకసమాచారాన్ని రాబట్టారు. ఇప్పటికే  పూరి,శ్యామ్,సుబ్బరాజు ,తరుణ్‌ల నుంచి సమాచారాన్ని రాబట్టిన పోలీసులకు నవదీప్ మరింత కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 11 గంటల పాటు సాగిన విచారణలో అధికారులు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలతో సహా నిర్దారించుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ కేసులో ఆరో రోజు సిట్ ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా ఇవాళ సిట్ ముందు హాజరుకానున్నాడు.

తాను నిర్వహించిన ఈవెంట్ల సందర్భంగా ప్రముఖులకు వారి ఇష్టంమేరకు మాదకద్రవ్యాలు సరఫరాచేశానని హీరో నవదీప్ సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఈవెంట్లు, పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంటాయి? అనే విషయాల్లోనూ కీలక సమాచారాన్ని బయటపెట్టినట్టు సమాచారం. నగరంలోని పబ్బులు, క్లబ్బుల్లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణంగా మారిందని, ఇందులో పబ్బు నిర్వాహకులు అందజేసేవాటితోపాటు కొం దరు కస్టమర్లు స్వయంగా డ్రగ్స్ తెచ్చుకుంటుంటారని కొత్త కో ణాన్ని వెల్లడించినట్టు సమాచారం.

హైదరాబాద్‌లో పేరుగాంచిన బీపీ ఎం పబ్బులో తాను భాగస్వామిగా ఉన్నది వాస్తవమేనని ఒప్పుకున్నట్టు సమాచారం. అమెరికా, బ్రెజిల్, బెల్జియం, థాయ్‌లాండ్‌లతో పాటు, దేశంలోని గోవా, ఊటీ, కొడైకెనాల్, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ప్రముఖులకు చెందిన పెద్దపెద్ద ఈవెంట్లను నిర్వహించినట్టు అంగీకరించారని తెలిసింది.

నగరంలో ఉన్న పబ్బుల్లో ఏ రకంగా డ్రగ్స్ వినియోగిస్తారు? అవి ఎక్కడి నుంచి సరఫరా అవుతాయి? వీఐపీలు, వీవీఐపీలకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు? తదితర ప్రశ్నలను సంధించినట్టు సమాచారం. ఈవెంట్ ఆర్గనైజర్‌గా ఎన్ని ఫంక్షన్లు ఏర్పాటుచేశారు? వంటి కీలక ప్రశ్నలకు సమాధారం దొరికినట్లు తెలుస్తోంది.

నవదీప్‌ను 11.20 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సిట్ బృందం.. అతడి రక్త నమూనాలతో పాటు, వెంట్రుకలు, గోర్లు సేకరించడానికి అనుమతి కోరారు. దీనికి నవదీప్ నిరాకరించడంతో ఎలాంటి నమూనాలను సేకరించలేదు.

- Advertisement -