SIR ప్రక్రియను నిలిపివేయాలి

7
- Advertisement -

AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. అక్టోబర్ 16న సాయంత్రం ముందస్తు చర్యల్లో భాగంగా ఆమెను నిర్బంధించిన పోలీసులు.. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం అధికారిక ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై నేహా బోరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశంలో చట్టవ్యవస్థ ఉల్లంఘనకు గురవుతోందని, సామాన్యులను నేరస్థుల్లా చూస్తున్నారని ఆమె ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని రాత్రంతా నిర్బంధించి, మరుసటి రోజు విడుదల చేయడం పోలీసులకు అలవాటుగా మారిందని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు చట్టపరంగా కల్పించిన హక్కులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను నిర్బంధించిన సమయంలో న్యాయవాదిని కలిసేందుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చిందని నేహా బోరా తెలిపారు. నిర్బంధంలో ఉన్నవారికి న్యాయ సహాయం పొందే అవకాశాలను కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

Also Read:‘రుటూర్’ను ప్రారంభించిన కేటీఆర్

ఇదిలా ఉండగా, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కూడా నేహా బోరా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని కోరారు.

- Advertisement -