టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. భారత వనరులను ఎలా వినియోగించుకోవాలో ఓ విదేశీయుడు దేశానికి నిర్దేశించలేడని స్పష్టం చేశారు. స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతుల విషయంలో నెలకొన్న వివాదంపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
భారత ప్రధానిపై ఎలాన్ మస్క్ ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. తాను నరేంద్ర మోదీ విధానాలను ఎప్పుడూ విమర్శిస్తానని, అయితే దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మాత్రం భారత్ వైఖరికి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. దేశ వనరులను ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని భారతదేశమే నిర్ణయిస్తుందని చెప్పారు.
ఓ తెల్లవాడు (గోరా) భారత్‌కు ఆదేశాలు ఇవ్వలేడు. ప్రపంచంలోనే భారత్‌లో డేటా ఛార్జీలు అత్యంత తక్కువగా ఉన్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా మనకు చెబుతోంది. కానీ అదే సమయంలో రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ తన 56 అంగుళాల ఛాతీ చూపించి ఎలాన్ మస్క్‌కు ‘బై బై’ చెప్పాలని కోరుకుంటున్నాను అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
Also Read:T20:విండీస్‌కు పూర్వవైభవం వచ్చేనా?
భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ మస్క్ గతంలో సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

