రేవంత్‌ను వదలని కోమటిరెడ్డి..ఈసారి సుప్రీంకు!

6
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, తెలంగాణ కంపెనీలకు పనులు దక్కకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లాబీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. రేడియల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో తమ కంపెనీకి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

తన కంపెనీ టెండర్‌లో పాల్గొనవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే రుద్ర ఉదయ్ సింహ ఫోన్ చేసి చెప్పారని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తన కుమారుడికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొంటుందని తాను ఆయనకు స్పష్టం చేసినట్లు తెలిపారు. 2015లో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు రుద్ర ఉదయ్ సింహ కూడా నిందితుడిగా ఉన్నారని ఆయన ప్రస్తావించారు.

రేడియల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ కాంట్రాక్టులను 15 శాతం కమిషన్ ప్రాతిపదికన కేటాయించారని తెలంగాణకు చెందిన ఆర్‌వీఎం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పేర్కొన్నట్లు తెలిపారు.

Also Read:T20:విండీస్‌కు పూర్వవైభవం వచ్చేనా?

- Advertisement -