BB10:హౌస్‌లో ఆధిపత్య పోరు!

2
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. నామినేషన్ల తర్వాత హౌస్‌లో సభ్యుల మధ్య దూరాలు పెరగడంతో పాటు కొత్త గొడవలు మొదలయ్యాయి. అక్టోబర్ 14న ప్రసారమైన 36వ రోజు ఎపిసోడ్‌లో గ్రూప్‌ గేమ్స్‌, ఫుడ్‌ కోసం పోటీ, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం హైలైట్‌గా నిలిచాయి.

నామినేషన్ల తర్వాత రోహిత్‌, షాలిని మధ్య కొంత దూరం ఏర్పడింది. తర్వాత షాలిని రోహిత్‌కు క్షమాపణ చెప్పినట్లు లైవ్‌లో కనిపించింది. మరోవైపు అమన్‌, షాలినితో రోహిత్‌ మాట్లాడుతూ.. ఇకపై ఎవరి ఆట వాళ్లు ఆడాలని, ప్రతి విషయంలో తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశాడు. ముకేశ్‌, వర్షిణి, ఝాన్సీ, సుధీర్‌ మధ్య కూడా గ్రూప్‌ వ్యూహాలపై చర్చ జరిగింది.

వైల్డ్‌కార్డ్స్‌, ఓజీలను విభజించి మూడు రోజుల పాటు హౌస్‌లోని వివిధ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. కిచెన్‌, లాంజ్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌, బ్యాక్‌యార్డ్‌ ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు సభ్యులు పోటీపడ్డారు. ఈ క్రమంలో రైస్‌ కుక్కర్‌లోని అన్నం తీసుకెళ్లడం, ఫుడ్‌ విషయంలో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రోహిత్‌ తనకు భోజనం ఉంచాలని కోరగా, అప్పటికే అందరూ తినేశారని కొందరు చెప్పారు. ఆహారం విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది.

తర్వాత వైల్డ్‌కార్డ్స్‌కు ప్రత్యేక టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యుల ప్రవర్తనను బట్టి వారికి తగిన ట్యాగులు ఇవ్వాలని సూచించాడు. దీంతో త్రిగుణ్‌కు ‘మానిప్యులేటివ్‌’, రోహిత్‌కు ‘డ్రామా కింగ్‌’, సుధీర్‌కు ‘అన్‌ట్రస్ట్‌వర్తీ’, షాలినికి ‘విక్టిమ్‌ కార్డ్‌’, వర్షిణికి ‘బ్రెయిన్‌లెస్‌’, రాంప్రసాద్‌కు ‘కన్నింగ్‌’ వంటి ట్యాగులు ఇచ్చారు.

Also Read:MGR బయోపిక్‌లో త్రిష?

ఈ ట్యాగుల ఆధారంగా జరిగిన క్విజ్‌లో టీమ్‌లు సమాధానాలు చెప్పేందుకు పోటీపడ్డాయి. కొన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలు రావడంతో పాయింట్లు కోల్పోయారు. అమన్‌ తనకు ‘సెల్ఫ్‌ అబ్సెస్డ్‌’ ట్యాగ్‌ సరిపోతుందని చెప్పడం, రోహిత్‌ను ‘డ్రామా కింగ్‌’గా గుర్తించడం ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -