సింగరేణిని ప్రైవేటీకరించే కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం అని తేల్చిచెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. గోదావరిఖనిలో జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభలో పాల్గొన్న కేటీఆర్.. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరుతో సుమారు రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలతో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశాము. గవర్నర్‌ను కలిసి కూడా విచారణ జరిపించాలని కోరాము అన్నారు.
రెండేళ్లలో రూ.6,317 కోట్ల సింగరేణి నిధులు పక్కదారి పట్టాయి. సింగరేణిలో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము .. కార్మికుల లాభాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కార్మికుల లాభాల వాటా, బోనస్ చెల్లించకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాము అని హెచ్చరించారు.
బొగ్గు కొరత పేరుతో అబద్ధాలు చెబుతూ.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిస్తుంది. కేసీఆర్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్ల స్థాయికి పెంచాము. సింగరేణి బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం సమగ్ర నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ పనితీరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ ఈవెంట్‌కు రూ.10 కోట్లు ఈ రేవంత్ రెడ్డి ఖర్చు చేసిండు. కేసీఆర్ హయాంలో 16 శాతం నుంచి 32 శాతానికి పెరిగిన కార్మికుల లాభాల వాటా.. సింగరేణి కార్మికుల కోసం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ గారిదే. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల కోసం నెలకు మూడుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. బెల్లంపల్లిలో కేసీఆర్ హయాంలో 7,600 మందికి పట్టాలు ఇస్తే, ప్రస్తుతం సుమారు 3,000 ఇళ్లకు సంబంధించిన భూములను 22-ఏ నిషేధిత జాబితాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది అన్నారు.2028లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే సింగరేణికి రక్షణ ఉంటుంది అన్నారు.
Also Read:రైతులకు మహా సర్కార్ దీపావళి కానుక..

