తమిళ సినీ, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) జీవిత కథ వెండితెరపైకి రానుంది. ‘పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్పై కోలీవుడ్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ త్రిషను సంప్రదిస్తున్నట్లు చిత్ర నిర్మాత, నటుడు జె.ఎం. బషీర్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.గతంలో ‘పసుంపొన్ దేవర్’ చిత్రంలో నటించిన జె.ఎం. బషీర్ ఈ బయోపిక్లో ఎంజీఆర్ పాత్రను పోషించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఎంజీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయ జీవితం, ప్రజల్లో ఆయనకున్న ఆదరణను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్రలో నటించేందుకు త్రిష ఇంకా అధికారికంగా అంగీకరించలేదు. చిత్ర బృందం నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
అక్టోబర్ 17 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న వ్యక్తి, సంగీత దర్శకుడి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.
Also Read:SIRపై సుప్రీంకు ఒవైసీ

