పోలీస్ నోటీసులపై అభిజిత్ కౌంటర్

2
- Advertisement -

అక్టోబర్ 10న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారే అవకాశముందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేస్తూ ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసులు తమ కార్యకర్తలకు నోటీసులు ఇస్తూ, ఢిల్లీ పర్యటనకు అయ్యే ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలని వేధిస్తున్నారని దీప్కే ఆరోపించారు.

Also Read:‘కాకా’లో బాలీవుడ్ నటుడు!

నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారుతుందని పోలీసులు ముందే ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించారు. మేము గాంధీజీ, అంబేడ్కర్ మార్గంలో శాంతియుతంగా పోరాడుతున్నాం. ప్రజలు తమ సొంత ఖర్చులతో ఢిల్లీకి వెళ్తుంటే ప్రశ్నించడం ఏంటి? ఇది స్పష్టంగా సర్కారు నియంతృత్వ ధోరణికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ… ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమేనని వారి అసలు ఉద్దేశం ‘ఒకే దేశం – ఒకే రాజకీయం/పార్టీ’ అని దీప్కే ఆరోపించారు.

- Advertisement -