క్రిశాంక్ అక్రమ అరెస్టుపై కేటీఆర్ ఫైర్

1
- Advertisement -

మన్నె క్రిశాంక్ అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడుతూనే, రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్నాడు అని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ఎవరిపైనైనా నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చు కానీ మా పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధారాలతో సహా అతని కుటుంబం చేస్తున్న అవినీతిని బయటపెడితే అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటున్నాడు కానీ పిరికివాడిలాగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు… రాహుల్ గాంధీ, నీ కీలుబొమ్మను అదుపులో పెట్టుకుని, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఆపు అని డిమాండ్ చేశారు.

- Advertisement -