‘కాకా’లో బాలీవుడ్ నటుడు!

1
- Advertisement -

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ‘కాకా’ చిత్రంలోకి అడుగుపెట్టారు. సినిమాలో ఆయన కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అనురాగ్ కశ్యప్ చిత్రంలో భాగమైన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోలో దర్శకుడు బాబీ కొల్లి అనురాగ్ కశ్యప్‌కు ఓ సన్నివేశాన్ని వివరిస్తుండగా, ఆయన ఎంతో ఏకాగ్రతతో వింటూ కనిపించారు. అనురాగ్ కశ్యప్ చేరిక సినిమాకు మరింత ఆసక్తిని తీసుకొచ్చింది. ‘కాకా’పై అంచనాలను మరింత పెంచింది.

ప్రస్తుతం ‘కాకా’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇతర ప్రధాన నటీనటులతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆమెను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా పరిచయం చేస్తూ, ఆమె పాత్ర పేరు అమ్ములు పాప అని రివిల్ చేశారు.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

Also Read:అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’

‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్, అనురాగ్ కశ్యప్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -