KTR:వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

7
- Advertisement -

తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేరళంలో ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్  మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు..బీజేపీతో పొత్తు ఉండదు అన్నారు.గత 26 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు.2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అన్నారు.

భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం…అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం?,కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది…జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుంది.దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24% నుంచి 19%కి తగ్గింది అన్నారు.

జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది…చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి?,ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదు?..దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తాం…డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను మేము నమ్మలేం అన్నారు.

తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు.రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు.కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని మేము భావిస్తున్నాం.అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదు?,తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయి.తెలంగాణలో ప్రస్తుతం RRR — Recall, Regret and Revolt పరిస్థితి కనిపిస్తోంది.2023 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.420కి పైగా హామీలు ఇచ్చినా, వాటిలో ఒక్కటినీ పూర్తిగా అమలు చేయలేకపోయింది.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉంది అన్నారు.

Also Read;Epic:ఓటీటీలోకి ఎపిక్‌

కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచించే పరిస్థితి ఏర్పడింది.ప్రజల్లో Regret నుంచి Revolt దిశగా మార్పు కనిపిస్తోంది.తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయుడిగా వ్యవహరిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్నారు.

- Advertisement -