యాక్షన్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic – First Semester). యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) కి సిద్ధమవుతోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అక్టోబర్ 9, 2026 నుండి ఓటీటీలో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. థియేట్రికల్ రన్ తీవ్ర నిరాశపరిచినప్పటికీ, ఓటీటీ వేదికగా ఈ సినిమాకి మెరుగైన ఆదరణ లభిస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.
Also Read:సాగరహారానికి 14 ఏళ్లు!
ఈ చిత్రంలో శివాజీ, వాసుకి, శ్రీనివాస్ గవిరెడ్డి, కళ్యాణ్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

