‘ఫౌజీ’ టీజర్ అప్‌డేట్!

8
- Advertisement -

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్/టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

1940ల నాటి బ్రిటిష్ కాలంనాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగనుందని సమాచారం. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి త్వరలోనే అధికారికంగా అప్‌డేట్ వెలువడే అవకాశం ఉండటంతో రెబల్ స్టార్ అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Also Read:గణేశుడి లడ్డూ@రూ. కోటి

- Advertisement -