తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన ఉత్సవాల వేళ గణనాథుడి ప్రసాదం (లడ్డూ) వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. పలు ప్రాంతాల్లో భక్తులు పోటీపడి లడ్డూలను భారీ ధరకు దక్కించుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ (గేటెడ్ కమ్యూనిటీ)లో గణేశుడి లడ్డూ వేలం మరోసారి కోటి రూపాయల మార్కును దాటింది. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ వేలంలో ‘శక్తిమాన్ టీమ్’ సభ్యులు రూ. 1.01 కోట్లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇదే విల్లాస్లో లడ్డూ ఏకంగా రూ. 2.31 కోట్లు పలకడం విశేషం. ఇక్కడ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.
సంగారెడ్డి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో సైతం గణేశుడి లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. చింతల్గట్టు వీరన్న అనే భక్తుడు రూ. 36 లక్షల భారీ మొత్తానికి ఈ లడ్డూను పాట పాడి దక్కించుకున్నారు.
Also Read:ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం..అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నం సాగర తీరాన ఏర్పాటు చేసిన మహాగణపతి ప్రసాదం కూడా విశేష ఆకర్షణగా నిలిచింది. అక్కడ ఏర్పాటు చేసిన 630 కిలోల భారీ మహాలడ్డూను భవానీ శంకర్ అనే భక్తుడు రూ. 25 లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నారు.

